Donald Trump: చైనాతో కీలక ఒప్పందం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!
- చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటన
- అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతికి చైనా ఓకే
- చైనా విద్యార్థులకు వీసాలు ఇచ్చేందుకు అమెరికా సమ్మతి
- ఇరుదేశాధినేతల ఆమోదమే తరువాయి అన్న ట్రంప్
- లండన్‌లో రెండు రోజులుగా జరిగిన చర్చల ఫలితం
అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల మధ్య ఒక అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా, ఆటోమోటివ్, రక్షణ రంగాలకు అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేయడానికి చైనా అంగీకరించిందని ఆయన తెలిపారు.
దీనికి ప్రతిగా, అమెరికాలోని కాలేజీలు, యూనివర్సిటీలలో చదువుకోవాలనుకునే చైనా విద్యార్థులకు వీసాలు జారీ చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం వేదిక 'ట్రూత్ సోషల్'లో ఒక పోస్ట్ ద్వారా ఈ వివరాలను పంచుకున్నారు.
"చైనాతో మా డీల్ పూర్తయింది. ఫుల్ మాగ్నెట్స్‌తో పాటు, అవసరమైన ఇతర అరుదైన ఖనిజాల ఎగుమతికి చైనా అంగీకరించింది. అదేవిధంగా, అమెరికా కాలేజీలు, యూనివర్సిటీల్లో చైనా విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు మేమూ అంగీకరించాం" అని ట్రంప్ తన పోస్టులో స్పష్టం చేశారు.
ఈ ఒప్పందానికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ది, తన ఆమోద ముద్ర మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. అమెరికాతో వాణిజ్య కార్యకలాపాలకు చైనాకు మార్గం సుగమం చేసేందుకు తానూ, జిన్‌పింగ్ కలిసి కృషి చేస్తున్నామని, ఇది ఇరు దేశాలకు గొప్ప విజయంగా నిలుస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న టారిఫ్ వార్ కారణంగా, చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులను నిలిపివేసింది. ట్రంప్ హయాంలో ప్రారంభమైన ఈ వాణిజ్య యుద్ధానికి ప్రతిస్పందనగా చైనా ఈ నిర్ణయం తీసుకోవడంతో, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఈ నేపథ్యంలో, కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా ఇరు దేశాలు అడుగులు వేశాయి. గత రెండు రోజులుగా లండన్ వేదికగా అమెరికా, చైనా ప్రతినిధుల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల ఫలితంగానే తాజా ఒప్పందంపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.