పీవీ సింధు ఫొటోలు వైరల్!

  • వియ‌త్నంలోని అమ‌నోయిలో భ‌ర్త‌తో క‌లిసి వెకేష‌న్ ఎంజాయ్ చేస్తున్న సింధు
  • ఆ స‌మ‌యంలో తీసిన  ఫొటోల‌ను ఇన్‌స్టాలో షేర్ చేసిన బ్యాడ్మింటన్ ప్లేయర్‌ 
  • ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న సింధు
  • మలేషియా మాస్టర్స్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమణ
  • ఇండోనేషియా ఓపెన్‌లో రెండో రౌండ్‌లోనే ఓటమి
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు సంబంధించిన కొన్ని  ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ప్ర‌స్తుతం వియ‌త్నంలోని అమ‌నోయిలో త‌న భ‌ర్త‌తో క‌లిసి వెకేష‌న్ ఎంజాయ్ చేస్తోంది. అయితే, తాజాగా ఈ బ్యాడ్మింటన్ స్టార్ బికినీలో మెరిసింది. ఆ స‌మ‌యంలో తీసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక‌గా పంచుకుంది. ఒక మంచి బ్రేక్ కావాలి.. అంటూ ఈ పోస్ట్‌లో ఆమె రాసుకొచ్చింది. దీంతో సింధు  ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారాయి.

అయితే, అభిమానులు, మీడియా వర్గాల్లో ఈ చిత్రాలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా ఆట‌ పరంగా సింధు వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ఫొటోలు బయటకు రావడం గమనార్హం. ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న విష‌యం తెలిసిందే. మలేషియా మాస్టర్స్ టోర్నమెంట్‌లో ఆమె తొలి రౌండ్‌లోనే ఓటమి పాలై నిష్క్రమించింది. ఆ తర్వాత జరిగిన ఇండోనేషియా ఓపెన్‌లో కూడా, సునాయాసంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో ఓడిపోయి, రెండో రౌండ్‌లోనే ఇంటి దారి ప‌ట్టింది.

ఇక‌, ఈ ఏడాది జనవరిలో ప్రఖ్యాత స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ ప్యూమాకు సింధు కొత్త అంబాసిడర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. 2025 బ్యాడ్మింటన్ ఇండియా ఓపెన్‌లో ప్యూమా బ్రాండ్‌తో కోర్టులోకి అడుగుపెట్టడమే కాకుండా, ఫ్యాషన్ రంగంలోనూ తనదైన ముద్ర వేసింది. ఈ భాగస్వామ్యం ద్వారా బ్యాడ్మింటన్ కోర్టు ఆవల కూడా సింధు తన బ్రాండ్ ఇమేజ్‌ను విస్తరించుకుంది.


More Telugu News