విమానం నడపనంటూ మొండికేసిన పైలట్.. ఎయిర్ పోర్ట్ లో ఉప ముఖ్యమంత్రి ఎదురుచూపులు
- మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు ఊహించని అనుభవం
- డ్యూటీ టైం ముగిసిందన్న పైలట్.. విమానం నడిపేందుకు నిరాకరణ
- మంత్రుల జోక్యంతో నలభై ఐదు నిమిషాల తర్వాత బయల్దేరిన విమానం
- తిరుగు ప్రయాణంలో కిడ్నీ రోగికి షిండే మానవతా దృక్పథంతో సహాయం
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన విమానం గంట ఆలస్యంగా ముంబై చేరుకుంది. ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేటు విమానం పైలట్, తన పనివేళలు ముగిశాయని చెప్పి టేకాఫ్‌కు నిరాకరించడమే ఇందుకు కారణం. మహారాష్ట్రలోని జలగావ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జలగావ్ జిల్లా ముక్తాయినగర్‌లో సంత్ ముక్తాయ్ 'పాల్ఖీ యాత్ర'లో షిండే పాల్గొన్నారు. వాస్తవానికి ఆయన మధ్యాహ్నం 3:45 గంటలకు జలగావ్ చేరుకోవాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల రెండున్నర గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముక్తాయినగర్ వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని మంత్రులు గిరీష్ మహాజన్, గులాబ్‌రావ్ పాటిల్ తదితరులతో కలిసి రాత్రి 9:15 గంటలకు షిండే జలగావ్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అయితే, అప్పటికే తన డ్యూటీ సమయం ముగిసిందని, తనకు అనారోగ్యంగా ఉందని విమానం నడిపేందుకు పైలట్ నిరాకరించారు. తిరిగి అనుమతులు తీసుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు. దీంతో మంత్రులు గిరీశ్ మహాజన్, గులాబ్‌రావ్ పాటిల్ సుమారు 45 నిమిషాల పాటు పైలట్‌తో చర్చించి, ఒప్పించారు. గిరీశ్ మహాజన్ సంబంధిత అధికారులతో మాట్లాడి టేకాఫ్‌కు అనుమతులు కూడా ఇప్పించారు. అనంతరం విమానం ముంబైకి బయలుదేరింది. "పైలట్‌కు ఆరోగ్య సమస్య, సమయపాలన విషయంలో ఇబ్బంది ఉంది. కొన్ని సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయి. మేము విమానయాన సంస్థతో మాట్లాడాం, వారు పైలట్‌కు పరిస్థితిని వివరించారు. ఇది చిన్న సమస్యే" అని గిరీశ్ మహాజన్ తెలిపారు.
కిడ్నీ రోగికి సహాయం
తిరుగు ప్రయాణంలో ఉప ముఖ్యమంత్రి షిండే ఓ కిడ్నీ రోగికి మానవతా దృక్పథంతో సహాయం అందించారు. ముంబైలో అత్యవసరంగా కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన శీతల్ పాటిల్ అనే మహిళ, ఆమె భర్త విమానం అందుకోలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి గిరీశ్ మహాజన్, షిండే విమానంలో వారిని ముంబైకి తరలించే ఏర్పాటు చేశారు. ముంబై విమానాశ్రయంలో అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచారు. "ఏక్‌నాథ్ షిండే తన కష్టకాలం నాటి రోజులను నేటికీ మర్చిపోలేదు. సామాన్యుడి పట్ల ఆయన చూపిన సున్నితత్వానికి ఇది నిదర్శనం" అని మంత్రి గులాబ్‌రావ్ పాటిల్ అన్నారు.