Akkineni Nagarjuna: చంద్రబాబును కలిసిన అక్కినేని నాగార్జున.. ఫొటోలు ఇవిగో

Nagarjuna Invites Chandrababu for Son Akhils Wedding

  • ఈ నెల 6న అక్కినేని అఖిల్ వివాహం
  • చంద్రబాబుకు వివాహ ఆహ్వాన పత్రికను అందించిన నాగార్జున
  • ఇరువురి మధ్య కాసేపు పలు అంశాలపై చర్చ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను నాగార్జున కలిశారు. తన కుమారుడు, యువ హీరో అక్కినేని అఖిల్ వివాహానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు నాగార్జున అందజేశారు.

ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. అఖిల్ వివాహం ఈ నెల 6వ తేదీన జరగనున్న నేపథ్యంలో, నాగార్జున ప్రముఖులను స్వయంగా కలిసి వివాహ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు ఉండవల్లికి విచ్చేసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇరువురు కాసేపు వివిధ అంశాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం.

Akkineni Nagarjuna
Chandrababu Naidu
Akkineni Akhil
Akhil marriage
Telugu cinema
Andhra Pradesh
Wedding invitation
Celebrity wedding
Tollywood
Undavalli
  • Loading...

More Telugu News