మాంసం వినియోగంలో తెలంగాణ టాప్!

  • మాంసాహారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు ఏడో ర్యాంకు
  • నెలకు సగటున ఒక వ్యక్తి 2 కిలోల మాంసం వినియోగం
  • నాగాలాండ్‌లో 99.8 శాతం మంది మాంసాహారులే
  • ఏపీ, తెలంగాణ, తమిళనాడులో చికెన్, మటన్‌తో పాటు చేపల వినియోగమూ ఎక్కువ
దేశంలో మాంసాహార వినియోగంలో తెలంగాణ రాష్ట్రం పరిమాణం పరంగా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సగటున ఒక్కో వ్యక్తి నెలకు రెండు కిలోల మాంసం తింటున్నట్లు నేషనల్‌ మీట్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎంఎంఆర్‌ఐ) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అయితే, మాంసం తినే వారి సంఖ్య పరంగా చూస్తే తెలంగాణ ఏడో స్థానంలో ఉందని జాతీయ ఆరోగ్య, కుటుంబ సర్వే నివేదిక పేర్కొంది. దేశంలో అత్యధికంగా నాగాలాండ్‌ ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నట్లు ఈ సర్వే తెలిపింది. ఆ రాష్ట్ర జనాభాలో ఏకంగా 99.8 శాతం మంది మాంసాహారం తింటున్నారని వివరించింది.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రజల మాంసాహారపు అలవాట్లు కూడా విభిన్నంగా ఉన్నాయని సర్వే వెల్లడించింది. ఉదాహరణకు.. నాగాలాండ్‌, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా చేపలను ఇష్టపడతారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో చికెన్‌, మటన్‌తో పాటు చేపలను కూడా అధికంగా తింటారు. ఒడిశా ప్రజలు రొయ్యలను ఇష్టంగా భుజిస్తారు. మరోవైపు, త్రిపురలో పంది మాంసం వినియోగం ఎక్కువగా ఉండగా, గోవాలో చేపలు, పీతల వంటి సముద్ర ఆహారం (సీఫుడ్) ఎక్కువగా తింటున్నారని సర్వే స్పష్టం చేసింది.  


More Telugu News