ఆ ఆలోచ‌న‌కు చాలా ఏళ్లు దూరంగా ఉన్నా.. కానీ గౌరీని అనుకోకుండా క‌లిసి ప్రేమ‌లో ప‌డ్డాను: ఆమిర్ ఖాన్

  • ఇటీవ‌ల త‌న ప్రేమ సంగ‌తిని బ‌య‌ట‌పెట్టిన ఆమిర్‌
  • గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డి
  • తాజాగా ఆమెతో బంధంపై మ‌రోసారి మాట్లాడిన న‌టుడు
  • అనుకోకుండా క‌లిసి ప్రేమికుల‌మ‌య్యామ‌న్న ఆమిర్ ఖాన్‌
  • తాను ప్రేమ‌లో ప‌డాల‌నే ఆలోచ‌న‌కు చాలా ఏళ్లు దూరంగా ఉన్న‌ట్లు వెల్ల‌డి
ఇటీవ‌ల త‌న ప్రేమ సంగ‌తిని బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే. గౌరీ స్ప్రాట్‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మ‌రోసారి ఆమెతో బంధంపై ఆమిర్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా బాలీవుడ్ న‌టుడు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నాడు. అస‌లు తాను ప్రేమ‌లో ప‌డాల‌నే ఆలోచ‌న‌కు చాలా ఏళ్లు దూరంగా ఉన్న‌ట్లు తెలిపారు. 

"నేను, గౌరీ స్ప్రాట్ అనుకోకుండా క‌లిశాం. ఆ త‌ర్వాత స్నేహితుల‌మ‌య్యాం. కొన్నేళ్ల త‌ర్వాత మా మ‌ధ్య ప్రేమ పుట్టింది. ఇప్పుడు మా మ‌ధ్య నిజ‌మైన ప్రేమ ఉంది. మేం భార్యాభ‌ర్త‌లు కాక‌పోవ‌చ్చు... కానీ, ఎప్ప‌టికీ కుటుంబంగానే ఉంటాం. 

నేను గౌరీని క‌ల‌వ‌డానికి ముందు థెర‌పీ చేయించుకున్నాను. దాని త‌ర్వాత న‌న్ను నేను ప్రేమించుకోవ‌డం ప్రారంభించాను. నా ఆరోగ్యంపై దృష్టిపెట్టాను. నా స్నేహితులు కూడా ప్ర‌తి విష‌యంలో మ‌ద్ద‌తుగా నిలిచారు. నాకు పిల్ల‌లు, పేరెంట్స్ ఉన్నారు. వారితో రోజంతా గ‌డుపుతాను" అని ఆమిర్ అన్నారు. 

కాగా, ఈ ఏడాది 60వ యేటా అడుగుపెట్టిన సంద‌ర్భంగా ఆమిర్ మీడియాతో మాట్లాడుతూ గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఏడాదిన్న‌ర‌గా ఆమెతో స‌హ‌జీవ‌నంతో ఉన్న‌ట్లు చెప్పారు. ఈ సంద‌ర్భంగానే ఆమెను మీడియాకు ప‌రిచ‌యం చేశారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య 25 ఏళ్ల స్నేహ‌బంధం ఉంది. ఆమిర్ నిర్మాణ సంస్థ‌లో ఆమె స‌హాయ‌కురాలిగా ప‌నిచేస్తున్నారు.    
ఇక‌, ఆమిర్ ఖాన్ అంత‌కుముందు కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. 16 ఏళ్ల‌పాటు క‌లిసి ఉన్న‌ ఈ దంప‌తులు 2021లో విడాకులు తీసుకున్నారు. అలాగే  కిర‌ణ్ రావు కంటే ముందు ఆమిర్‌కు 1986లో రీనా దత్తాను పెళ్లాడారు. వారికి ఇద్దరు పిల్లలు. ఈ జంట‌ 2002లో విడిపోయింది. 

ఆమిర్ సినిమాల విష‌యానికి వ‌స్తే... ప్ర‌స్తుతం ఆయ‌న న‌టించిన 'సితారే జ‌మీన్ ప‌ర్' మూవీ విడుద‌ల‌కు రెడీగా ఉంది. జూన్ 20న ఈ చిత్రం థియేట‌ర్ల‌లోకి రానుంది. ఇది విడుద‌లైన త‌ర్వాత త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ 'మ‌హాభార‌తం'ను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ఆమిర్ వెల్ల‌డించారు.  


More Telugu News