ప్లీజ్‌.. పొగ తాగ‌కండి: అల్లు అర్జున్‌

  • నేడు ప్ర‌పంచ పొగాకు వ్య‌తిరేక దినోత్స‌వం
  • ఈ సంద‌ర్భంగా  'ప్లీజ్‌.. పొగ తాగ‌కండి' అని బ‌న్నీ ఇన్‌స్టా పోస్ట్
  • అల్లు అర్జున్‌ పోస్ట్‌పై నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు   
యువ‌తపై సినిమా హీరోల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. అందుకే వారితో ప్ర‌క‌ట‌న‌లు చేసేందుకు కంపెనీలు ముందుకువ‌స్తుంటాయి. అయితే, త‌మ అభిమానుల‌కు హాని చేసే వాటిని వ్య‌తిరేకించేవారు కొంద‌రు మాత్ర‌మే ఉంటారు. 

నేడు ప్ర‌పంచ పొగాకు వ్య‌తిరేక దినోత్స‌వం సంద‌ర్భంగా 'ప్లీజ్‌.. పొగ తాగ‌కండి' అని అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పోస్ట్ చేయ‌డంప‌ట్ల ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. ఇత‌ర న‌టీన‌టులు సైతం ఇలా పొగాకు, మ‌ద్య‌పానంపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని నెటిజ‌న్లు సూచిస్తున్నారు. 

"నిప్పులా ఉండండి. పొగ తాగొద్దు. పొగ తాగకు బ్రదర్" అని బ‌న్నీ త‌న ఇన్‌స్టా స్టోరీ రాసుకొచ్చారు. దీనికి 'స్మోకింగ్ కిల్స్' అనే క్యాప్ష‌న్‌తో ఉన్న టీష‌ర్టు ధ‌రించి ఉన్న‌ ఫొటోను అల్లు అర్జున్ జోడించారు.

ఇదిలాఉంటే... ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీతో త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ 'A22 x A6'గా పిలవబడుతున్న ఈ చిత్రం, భారతీయ విలువలతో కూడిన కథనంతో ఓ భారీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందని స‌మాచారం.   

ఇక‌, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు బ‌న్నీ. 'పుష్ప 2' చిత్రంతో ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర రూ.1870 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబట్టింది. దీంతో అల్లు అర్జున్ త‌ర్వాతి ప్రాజెక్ట్ పై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి ఎలాంటి సినిమాతో వస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


More Telugu News