ఇందిరా పార్క్ వద్ద నిరసనకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిలుపు
- మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
- నిరసన తెలుపుతూ ఎమ్మెల్సీ కవిత పిలుపు
- జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సన్నాహాలు
- తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కూడా అయిన కవిత, జూన్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఈ నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుందని ఆమె తెలిపారు.
ఇదిలా ఉండగా, ఈరోజు సాయంత్రం నగరంలోని బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి సంస్థ నూతన కార్యాలయాన్ని కూడా ఎమ్మెల్సీ కవిత ప్రారంభించనున్నారు.