వైజాగ్‌లో ప‌లువురు సినీ ప్ర‌ముఖుల కీల‌క భేటీ

  
విశాఖ‌ప‌ట్నంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు కీల‌క భేటీ నిర్వ‌హిస్తున్నారు. దొండ‌ప‌ర్తిలో నిర్మాత‌ల‌తో పాటు డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు స‌మావేశ‌మ‌య్యారు. నిర్మాత‌లు సి. క‌ల్యాణ్‌, శ్ర‌వంతి ర‌వికిశోర్‌, భ‌ర‌త్ భూష‌ణ్, సుధాక‌ర్ రెడ్డి త‌దిత‌రులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. థియేట‌ర్ల నిర్వ‌హ‌ణ‌, సినిమా టికెట్లు, ప‌ర్సంటేజీల‌పై ఈ భేటీలో చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. స‌మావేశం అనంత‌రం క‌మిటీ ఏర్పాటుపై నిర్ణ‌యం తీసుకోనున్నారు. 

కాగా, ఇటీవ‌ల ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌ కల్యాణ్‌ తెలుగు చిత్ర పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను మ‌ర్యాద‌పూర్వ‌కంగానైనా కలిశారా ? అంటూ ప్ర‌శ్నించారు. ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని అన్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సినీ ప్ర‌ముఖులు స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. 


More Telugu News