గద్దర్ ఫిల్మ్ అవార్డుల విజేతలకు జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు

  • తెలంగాణ ప్రభుత్వ చొరవ ఎంతో సంతోషాన్నిస్తోందని వ్యాఖ్య
  • 'దేవర' సినిమాకు గాను గణేశ్ ఆచార్యకు ఉత్తమ కొరియోగ్రాఫర్ పురస్కారం
  • గణేష్ ఆచార్యకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన ఎన్టీఆర్
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ ఏడాది నుంచే తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించడం నిజంగా సంతోషాన్ని కలిగించే విషయమని ఆయన అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన తన 'ఎక్స్' ఖాతాలో రాసుకొచ్చారు. తన చిత్రం 'దేవర'లో కొరియోగ్రఫీ అందించిన గణేశ్ ఆచార్యకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు దక్కడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. "గణేశ్ ఆచార్య గారు.. 'దేవర' సినిమాకు అందించిన అద్భుతమైన నృత్య దర్శకత్వానికి గాను ఈ పురస్కారం వరించినందుకు అభినందనలు" అని పేర్కొన్నారు.


More Telugu News