'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'కు ప‌వ‌న్ డ‌బ్బింగ్‌పై మేక‌ర్స్ ఆస‌క్తిక‌ర పోస్ట్

  • పవన్ కల్యాణ్ హీరోగా తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'
  • జూన్ 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న‌ సినిమా
  • ప‌వ‌న్ త‌న పాత్ర‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ను పూర్తి చేసిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌ట‌న‌
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. వ‌చ్చే నెల 12న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ప‌వ‌న్ త‌న పాత్ర‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ను పూర్తి చేసిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. త‌న బిజీ షెడ్యూల్‌లోనూ రాత్రి 10 గంట‌ల‌కు డ‌బ్బింగ్ మొదలు పెట్టి నాలుగు గంట‌ల్లోనే పూర్తి చేసినట్లు వెల్ల‌డించారు. డ‌బ్బింగ్‌కు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. "పవర్ స్టార్మ్‌కి సిద్ధంగా ఉండండి. జూన్ 12న సినిమా థియేటర్లలో క‌లుద్దాం" అంటూ రాసుకొచ్చారు.  

ఇక‌, ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించనుండగా.. ఫస్ట్ పార్ట్ 'హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో జూన్ 12న విడుద‌ల‌వుతుంది. పవన్ సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటించగా.. అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు ఇత‌ర‌ కీలక పాత్రలు పోషించారు. 

ప్ర‌ముఖ‌ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.దయాకర్‌రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. క్రిష్ జాగ‌ర్లమూడి, జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత‌ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.

ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నుంచి ఇప్పటికే విడుద‌లైన‌ 'మాట వినాలి', 'కొల్లగొట్టినాదిరో', 'అసుర హననంస పాట‌ల‌తో పాటు బుధ‌వారం విడుద‌లైన 'తార తార నా క‌ళ్లు.. వెన్నెల పూత నా ఒళ్లు' శ్రోతుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి.


More Telugu News