మరణించినా తెలుగుజాతి గుండె చప్పుడు ఎన్టీఆర్: పయ్యావుల కేశవ్
- కడపలో కొనసాగుతున్న టీడీపీ మహానాడు-2025
- సభికులను ఉద్దేశించి మాట్లాడిన సీనియర్ నేత
- రాష్ట్ర రాజకీయాలు, పార్టీ అంశాలపై ప్రస్తావించినట్లు సమాచారం
- పయ్యావుల ప్రసంగానికి పార్టీ వర్గాల్లో ప్రాధాన్యత
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులు అర్పిస్తూ రెండోరోజు కార్యక్రమం ప్రారంభమవుతున్నట్టు చెప్పారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మహోన్నత శిఖరాలపై నిలబెట్టిన మహనీయుడు, మరణించినా తెలుగుజాతి గుండె చప్పుడుగా నిలిచిన మహోన్నతుడు, అనితర సాధ్యమైనటువంటి చరిత్ర సృష్టించిన ప్రజా నాయకుడు, తెలుగు గడ్డమీదే కాకుండా యావత్ దేశంలోనూ తెలుగు కీర్తిపతాకను రెపరెపలాడించిన మహోన్నతుడు, నిజాయతీ, నిబద్ధతకు నిలువెత్తు స్వరూపం, తెలుగుజాతి చరిత్రను తిరగరాసి, వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అధికారాన్ని అందించిన మహోన్నతుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన నటించిన సినిమా సంచలనమని, ఆయన రాజకీయం రారాజకీయమని అన్నారు. అటువంటి మహానుభావుడికి ఘనమైన నివాళి అర్పిస్తున్నట్టు పేర్కొన్నారు.