Chaurya Paatham: అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'చౌర్యపాఠం' స్ట్రీమింగ్

Chaurya Paatham Streaming on Amazon Prime Video
షార్ట్స్‌లో చూడండి
నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'చౌర్యపాఠం'. బ్యాంకు దోపిడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైంది. అయితే, విడుదలైన కొద్ది రోజులకే థియేటర్ల నుంచి నిష్క్రమించింది.

తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

'చౌర్యపాఠం' కథాంశం విషయానికి వస్తే.. వేదాంత్ రామ్ (ఇంద్రరామ్) దర్శకుడు కావాలని కలలు కంటాడు. అయితే నిర్మాతలు ముందుకు రాకపోవడంతో బ్యాంకు దోపిడీ చేసి ఆ డబ్బుతో సినిమా నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన పథకంలో భాగస్వాములను చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి (పాయల్ రాధాకృష్ణ) వీళ్లతో కలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. 
Go Back to Shorts
Chaurya Paatham
Amazon Prime Video
Indra Ram
Payal Radhakrishna
Nakkina Trinath Rao
Bank Robbery Movie
Telugu Movie OTT
OTT Streaming

More Telugu News