థియేటర్ల బంద్ వ్యవహారం... జనసేన నేతపై వేటు వేసిన పవన్ కల్యాణ్

  • థియేటర్ల బంద్ ప్రకటన వెనుక జనసేన నేత ఉన్నాడంటూ వార్తలు
  • అత్తి సత్యనారాయణపై వేటు వేసిన పవన్
  • పార్టీ సభ్యత్వం కూడా రద్దు
సినిమా థియేటర్ల బంద్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారం వెనుక జనసేన నేత ఉన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వేటువేశారు. ఆయన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. 

ఆయనపై వచ్చిన ఆరోపణలు సత్యమా? అసత్యమా? అని తేలేంత వరకు పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. అత్తి సత్యనారాయణకు సినీ డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో పేరు ఉంది.


More Telugu News