అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహానాడు... రిజిస్ట్రేషన్ చేయించుకున్న చంద్రబాబు
- కడపలో ప్రారంభమైన టీడీపీ మహానాడు
- రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
- 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు
2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇది. మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈరోజున మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలు, ఆరు సూత్రాల ఆవిష్కరణ, నియమావళి సవరణలపై చర్చ జరుగుతుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.