టీ20ల్లో ప్ర‌పంచ‌ రికార్డు సృష్టించిన సూర్య‌కుమార్ యాద‌వ్‌

  • టీ20ల్లో వ‌రుస‌గా 14 సార్లు 25 ప్ల‌స్‌ స్కోర్ చేసిన తొలి బ్యాట‌ర్‌గా సూర్య‌ ప్ర‌పంచ రికార్డు
  • గ‌తంలో ఈ రికార్డు ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు బ‌వుమా (13) పేరిట
  • నిన్న పంజాబ్‌తో మ్యాచ్ ద్వారా బ‌వుమా రికార్డును అధిగ‌మించిన సూర్య‌కుమార్‌
ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) స్టార్ ఆట‌గాడు సూర్య‌కుమార్ యాద‌వ్ టీ20 క్రికెట్‌లో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పారు. టీ20ల్లో వ‌రుస‌గా 14 సార్లు 25 ప్ల‌స్‌ స్కోర్ చేసిన తొలి బ్యాట‌ర్‌గా ప్ర‌పంచ రికార్డు సృష్టించాడు. గ‌తంలో ఈ రికార్డు ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు టెంబా బ‌వుమా పేరిట ఉండేది. బ‌వుమా వ‌రుస‌గా 13 సార్లు 25+ స్కోర్ చేశాడు. 

ఐపీఎల్‌లో భాగంగా సోమ‌వారం జైపూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)తో జ‌రిగిన మ్యాచ్ లో బ‌వుమా వ‌ర‌ల్డ్ రికార్డును సూర్య‌భాయ్ అధిగ‌మించాడు. ఈ మ్యాచ్ లో అత‌డు 39 బంతుల్లో 57 ప‌రుగులు చేశాడు. వీరిద్ద‌రి త‌ర్వాత బ్రాడ్ హాడ్జ్, జాక్వెస్ రుడాల్ఫ్, కుమార్ సంగక్కర, క్రిస్ లిన్, కైల్ మేయర్స్  వ‌రుస‌గా 11 సార్లు 25కి పైగా స్కోర్ల‌తో త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

కాగా, ఈ మ్యాచ్‌లో సూర్య‌కుమార్ అర్ధ శ‌త‌కం (57)తో రాణించిన‌ప్ప‌టికీ ముంబ‌యికి ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. ఇక‌, ఈ సీజ‌న్‌లో ముంబ‌యి ఇండియ‌న్స్ ఇప్ప‌టికే ప్లేఆఫ్స్ చేరిన విష‌యం తెలిసిందే. అయితే, ఎంఐ ప్లేఆఫ్స్ చేర‌డంతో సూర్య‌దే కీరోల్‌. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడుతున్న అతడు... ముంబ‌యి విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఐపీఎల్‌ ఎడిష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 14 మ్యాచులాడిన సూర్య‌కుమార్ ఐదు అర్ధ సెంచ‌రీల‌తో 640 ప‌రుగులు చేశాడు.    


More Telugu News