రుతుపవనాల ఎఫెక్ట్... కడప, బాపట్ల జిల్లాల్లో వర్షం
- రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు
- కడపలో చల్లబడ్డ వాతావరణం
- ద్రోణి ప్రభావంతో బాపట్ల జిల్లాలో వర్షాలు
నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ఎంటర్ అయ్యాయి. వీటి ప్రభావంతో రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. కడప పట్టణంలో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
మరోవైపు, ఉపరితల ద్రోణి కారణంగా బాపట్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా చీరాల, వేటపాలెం మండలాల్లో భారీ వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా ఏకధాటిగా కురిసిన వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.
ఈ భారీ వర్షం సమయంలో పెద్ద శబ్దాలతో కూడిన ఉరుములు, మెరుపులు రావడంతో స్థానిక ప్రజలు కొంత ఆందోళనకు గురయ్యారు. అకాల వర్షం కారణంగా కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. వాతావరణ శాఖ సూచనల మేరకు, రాబోయే కొద్ది రోజులు కూడా ఇదే తరహా వర్షాలు కొనసాగవచ్చని తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.