Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Gopal Varma on Social Media Ban for Children
షార్ట్స్‌లో చూడండి
సోషల్ మీడియా ఇప్పుడు జనాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది లేకుండా జనాలు కొంత సమయం కూడా గడిపే పరిస్థితి కనిపించడం లేదు. చిన్న పిల్లలు సైతం దీనికి బానిసలు కావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా పలు దేశాలు నిషేధం విధించే దిశగా వెళుతున్నాయి. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలనే డిమాండ్ ఇండియాలో కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

సోషల్ మీడియా అంటే కేవలం కాలక్షేపం కాదని, అది జ్ఞాన భాండాగారమని ఆర్జీవీ అన్నారు. ఇతర దేశాల్లో పిల్లలు రెడ్డిట్, యూట్యూబ్ వంటి ప్లాట్ ఫామ్స్ ద్వారా కోడింగ్, సైన్స్ నేర్చుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్నారని... మనం ఇక్కడ సోషల్ మీడియాపై నిషేధం విధిస్తే... మన పిల్లలు పోటీలో వెనుకబడిపోతారని చెప్పారు. మన పిల్లల జీవితాన్ని మనమే నాశనం చేసిన వాళ్లమవుతామని అన్నారు. కొందరు చేసే తప్పులకు మొత్తం టెక్నాలజీని నిషేధించడం సరికాదని చెప్పారు. రక్షణ పేరుతో పిల్లలకు ఇన్ఫర్మేషన్ అందకుండా ఆపేస్తే... వారి జీవితం అంధకారం అవుతుందని అన్నారు. కెరీర్ బాగుండాలంటే డిజిటల్ ప్రపంచంపై పట్టు ఉండాలని చెప్పారు.
Go Back to Shorts
Ram Gopal Varma
RGV
Social Media Ban
Children Social Media
Social Media Effects
Digital Education
Reddit
YouTube
Technology
Parenting

More Telugu News