పుతిన్ హెలికాప్టర్ ను టార్గెట్ చేసిన ఉక్రెయిన్... డ్రోన్ ను మధ్యలోనే అడ్డుకున్న రష్యా!

  • ఉక్రెయిన్ డ్రోన్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న పుతిన్
  • పుతిన్ ఎయిర్ రూట్‌లో ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ ను మార్గమధ్యంలోనే కూల్చివేసిన రష్యా ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్
  • ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడి యత్నంగా భావిస్తున్న రక్షణ విభాగం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. అయితే, ఈ దాడి నుంచి పుతిన్ తృటిలో తప్పించుకున్నారని రష్యా అధికారులు వెల్లడించారు.

సమస్యాత్మక సరిహద్దు ప్రాంతమైన కుర్స్క్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత పుతిన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ బలగాలను ఆ ప్రాంతం నుంచి తరిమికొట్టినట్లు ఏప్రిల్‌లో రష్యా ప్రకటించినప్పటి నుంచి కుర్స్క్ ప్రాంతంలో పుతిన్ పర్యటించడం ఇదే తొలిసారి.

పుతిన్ ప్రయాణిస్తున్న మార్గంలోకి ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్‌ను రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మధ్యలోనే అడ్డుకుని కూల్చివేసిందని అధికారులు తెలిపారు. అధ్యక్షుడి కాన్వాయ్‌ను గాల్లో ఉండగానే ఢీకొట్టే లక్ష్యంతో ఈ దాడి జరిగిందని రక్షణ విభాగంలోని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నట్లు రష్యా మీడియా వెల్లడించింది.

ఈ ఘటనపై రష్యా భద్రతా ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. ఉక్రెయిన్ డ్రోన్ ఏ విధంగా కుర్స్క్ ఎయిర్ స్పేస్‌ను ఉల్లంఘించింది? ఇది హత్యాయత్నమా? కీవ్ సైకలాజికల్ స్ట్రాటజీలో ఇదొక భాగమా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News