తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

  • టీజీ ఈసెట్ ఫలితాల‌ను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలక్రిష్ణ రెడ్డి 
  • ఈసెట్ ఫ‌లితాల్లో 93.87 శాతం ఉత్తీర్ణ‌త 
  • మెటలార్జిక‌ల్ ఇంజినీరింగ్, బీఎస్సీ మ్యాథ్స్, ఫార్మ‌సీలో 100 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు
తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో టీజీ ఈసెట్ ఫలితాల‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలక్రిష్ణ రెడ్డి విడుదల చేశారు. ఈసెట్ ఫ‌లితాల్లో 93.87 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. 

మెకానికల్ ఇంజినీరింగ్‌లో పోతుగంటి కార్తిక్, సివిల్ ఇంజినీరింగ్‌లో గోల్కొండ నిఖిల్ కౌశిక్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో శ్రీకాంత్, ఫార్మసీలో ఐలి చందన, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కట్లే రేవతి, బీఎస్సీ మ్యాథ్స్‌లో సంతోష్ కుమార్, మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో తోట సుబ్రహ్మణ్యం, కెమికల్ ఇంజినీరింగ్‌లో లెంక తేజ సాయి, ఎల‌క్ట్రికల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో కాసుల శ్రావణి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో రాపర్తి చందన, మైనింగ్ ఇంజినీరింగ్‌లో కుర్మ అక్షయ మొద‌టి ర్యాంకు సాధించారు.

కాగా, టీజీ ఈసెట్ పరీక్ష మే 12న జరగ‌గా... 18,998 మంది విద్యార్థులు పరీక్షకు హాజ‌ర‌య్యారు. ఈసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2025-26 విద్యా సంవత్సరంలో బీటెక్, బీఈ, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పించనున్నారు. 


More Telugu News