టీమిండియా కెప్టెన్‌గా గిల్‌.. ఇంగ్లాండ్ టూర్ కోసం టెస్టు జట్టును ప్రకటించిన బీసీసీఐ

  • ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 18 మంది ఆట‌గాళ్ల‌తో జ‌ట్టు ప్ర‌క‌టన‌
  • యువ ఆట‌గాడు గిల్‌కు ప‌గ్గాలు.. వైస్ కెప్టెన్‌గా పంత్‌
  • కోహ్లీ, రోహిత్‌ లేకపోవడం జ‌ట్టుకు పెద్ద లోటే అన్న‌ కోచ్‌ గంభీర్‌
ఇంగ్లాండ్ టూర్ కోసం భారత టెస్ట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 18 మంది ఆట‌గాళ్ల‌తో జ‌ట్టును ప్ర‌క‌టించింది. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం యువ ఆట‌గాడు శుభ్‌మన్ గిల్ ను కెప్టెన్‌గా ఎంచుకుంది. రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత్ ఆడబోయే మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇదే.  

కోహ్లీ, రోహిత్‌ లేకపోవడం జ‌ట్టుకు పెద్ద లోటే: కోచ్‌ గౌతం గంభీర్‌
ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ లేకపోవడం భార‌త జ‌ట్టుకు పెద్ద లోటేన‌ని టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. కానీ, మిగిలిన ప్లేయర్లకు మంచి అవకాశమని గౌతీ పేర్కొన్నాడు. "ఆట ఎప్పుడు మొదలుపెట్టాలి.. ఎప్పుడు ముగించాలనేది పూర్తిగా ఆట‌గాళ్ల‌ వ్యక్తిగతం. ప్లేయ‌ర్ల‌కు కోచ్‌ అయినా, సెలక్టర్‌ అయినా రిటైర్‌ కావాలని చెప్పే హక్కు లేదు. ఎంతో అనుభవజ్ఞులైన విరాట్‌, రోహిత్‌ ఇప్పుడు టెస్టు జట్టులో లేకపోవడం లోటే. యువకులకు ఇది సువర్ణవకాశం" అని గంభీర్‌ చెప్పాడు. 

ఇంగ్లాండ్ టూర్‌కి భార‌త జ‌ట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్‌ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్, ప్ర‌సిద్ధ్‌ కృష్ణ, ఆకాశ్ దీప్‌, అర్ష్‌దీప్ సింగ్‌, కుల్దీప్ యాద‌వ్‌.


More Telugu News