క‌డ‌ప జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం... అక్కడికక్కడే ఐదుగురు మృతి

  • సి.కె.దిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్‌ వద్ద ప్రమాదం 
  • గువ్వలచెరువు ఘాట్‌ మలుపు వద్ద కారుపైకి దూసుకెళ్లిన లారీ
  • కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి 
  • మృతుల్లో చిన్నారి, ముగ్గురు మహిళలు 
ఏపీలోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. జిల్లాలోని సి.కె.దిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్‌ వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. గువ్వలచెరువు ఘాట్‌ మలుపు వద్ద కారుపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. 

మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. రాయ‌చోటి నుంచి క‌డ‌ప‌కు కారులో వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద‌స్థలికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుప‌త్రికి తరలించారు.  


More Telugu News