Pawan Kalyan: విశాఖ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన గోవిందరెడ్డికి పవన్ కల్యాణ్ అభినందనలు

- విశాఖ డిప్యూటీ మేయర్ గా దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవం
- తమ పార్టీ నేతకు కీలకపదవి దక్కడం పట్ల పవన్ హర్షం
- అభినందనలు తెలుపుతూ ప్రకటన విడుదల
గేట్రర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. గోవిందరెడ్డి విశాఖ 64వ డివిజన్ లో జనసేన కార్పొరేటర్ గా ఉన్నారు. తమ పార్టీకి చెందిన నేత డిప్యూటీ మేయర్ కావడం పట్ల జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన దల్లి గోవిందరెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.
"64వ డివిజన్ లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన గోవిందరెడ్డి పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలకు అనుగుణంగా అనునిత్యం పనిచేస్తారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తారని, నగర అభివృద్ధికి, మౌలిక వసతుల మెరుగుదలకు కృషి చేస్తారని, సదా ప్రజల పక్షాన నిలుస్తారని ఆకాంక్షిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.