Nara Lokesh: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల... విషెస్ చెప్పిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Congratulates AP ICET 2025 Qualifiers

  • ఏపీ ఐసెట్-2025 ఫలితాలు విడుదల
  •  95.86 శాతం మంది విద్యార్థుల ఉత్తీర్ణత
  • మొదటి ర్యాంకు సాధించిన మేకా మనోజ్
  • వెబ్సైట్ లో అందుబాటులో ర్యాంక్ కార్డులు
  • మంత్రి నారా లోకేశ్ నుంచి విద్యార్థులకు అభినందనలు

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్-2025) ఫలితాలు గురువారం వెలువడ్డాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ICET/ ద్వారా తెలుసుకోవచ్చు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. మే 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 93 కేంద్రాల్లో, హైదరాబాద్‌లోని ఒక కేంద్రంతో కలిపి మొత్తం 94 కేంద్రాల్లో రెండు సెషన్లలో ఈ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది ఐసెట్ పరీక్షకు మొత్తం 37,572 మంది దరఖాస్తు చేసుకోగా, 34,131 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 32,719 మంది అర్హత సాధించారు. అంటే, ఉత్తీర్ణతా శాతం 95.86%గా నమోదైంది. 

మీ ఉజ్వల భవిష్యత్తుకు నా శుభాకాంక్షలు: నారా లోకేశ్

ఈ సందర్భంగా రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. "ఏపీ ఐసెట్ లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు. ఫలితాలు ఇప్పుడు https://cets.apsche.ap.gov.in/ICET , వాట్సాప్ గవర్నెన్స్ నెం. 9552300009 లో అందుబాటులో ఉన్నాయి. మీ ఉజ్వల విద్యా భవిష్యత్తుకు నా శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.

ఐసెట్-2025 టాపర్ల వివరాలు ఇలా ఉన్నాయి...

మేకా మనోజ్ 197.91 మార్కులతో మొదటి ర్యాంకు కైవసం చేసుకోగా, డి. సందీప్ రెడ్డి 179.51 మార్కులతో రెండో ర్యాంకు, ఎస్. కృష్ణ సాయి 178.51 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. అలాగే, వల్లూరి సాయిరామ్ సాత్విక్ 175.69 మార్కులతో నాలుగో ర్యాంకు, రావూరి మాధుర్య 175.45 మార్కులతో ఐదో ర్యాంకును దక్కించుకున్నారు.

కాగా, మే 10వ తేదీన ప్రాథమిక ‘కీ’ ని విడుదల చేసి, మే 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించారు. వచ్చిన అభ్యంతరాలను నిపుణుల బృందం పరిశీలించి, తుది ‘కీ’ ని రూపొందించింది. ఈ తుది ‘కీ’ ఆధారంగానే ఫలితాలను వెల్లడించారు. అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. తదుపరి అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి త్వరలో విడుదల చేయనుంది.

Nara Lokesh
AP ICET 2025
AP ICET Results
MBA MCA Admissions
Andhra University
GP Rajasekhar
APCHE
ICET Toppers
Meka Manoj
Entrance Exam
  • Loading...

More Telugu News