Stock Markets: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- 872 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 261 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2.76 శాతం పతనమైన మారుతి షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 872 పాయింట్లు కోల్పోయి 81,186కి దిగజారింది. నిఫ్టీ 261 పాయింట్లు నష్టపోయి 24,683కి పడిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.63గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ గెయినర్స్
టాటా స్టీల్ (0.73%), ఇన్ఫోసిస్ (0.08%), ఐటీసీ (0.07%).
టాప్ లూజర్స్
మారుతి (-2.76%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.13%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.04%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.01%), నెస్లే ఇండియా (-1.92%).