తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన: జగన్

  • టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు
  • నివాళి అర్పించిన జగన్
  • ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు
స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులుకు వైసీపీ అధినేత జగన్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా జగన్ స్పందిస్తూ... 'స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులుగారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. నేడు ప్రకాశం పంతులుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు' అని ట్వీట్ చేశారు. 


More Telugu News