పాన్ ఇండియా దర్శకుడు అట్లీకి డాక్టరేట్

  • దర్శకుడు అట్లీకి డాక్టరేట్ ప్రకటించిన చెన్నైకి చెందిన సత్యభామ వర్శిటీ 
  • జూన్ 14న జరగనున్న 35వ స్నాతకోత్సవంలో డాక్టరేట్  ప్రదానం చేయనున్న వర్శిటీ 
  • అట్లీకి శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు, నెటిజన్లు
పాన్ ఇండియా మూవీస్ డైరెక్టర్ అట్లీకి డాక్టరేట్ లభించనుంది. చెన్నైకి చెందిన సత్యభామ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రకటించింది. జూన్ 14న జరిగే యూనివర్సిటీ 35వ స్నాతకోత్సవ వేడుకలో అట్లీకి డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కోలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడుగా పేరొందిన అట్లీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. రాజారాణి, తేరి (పోలీసోడు), మెర్సల్ (అదిరింది), బిగిల్ (విజిల్) చిత్రాలతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు పొందారు. షారూక్ ఖాన్ హీరోగా ఆయన తెరకెక్కించిన జవాన్ చిత్రం రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే.

దీంతో ఆయన తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌తో ఆయన మూవీ చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. 


More Telugu News