న‌టుడు మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట్లో తీవ్ర విషాదం

  • భ‌ర‌త్ త‌ల్లి కమలాసిని హఠాన్మరణం
  • ఆదివారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో కన్నుమూత‌
  • త‌ల్లి అకాల మ‌ర‌ణంతో భరత్ తీవ్ర దిగ్భ్రాంతి
టాలీవుడ్ యువ నటుడు మాస్టర్ భరత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. భ‌ర‌త్ త‌ల్లి కమలాసిని హఠాన్మరణం చెందారు. ఆదివారం రాత్రి చెన్నైలో ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. కమలాసిని గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. త‌ల్లి అకాల మ‌ర‌ణంతో భరత్ తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు. 

భ‌ర‌త్‌కు మాతృ వియోగం విష‌యం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయ‌న‌కు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు  చెన్నైలోని భరత్ ఇంటికెళ్లి కమలాసిని భౌతిక కాయాన్ని సందర్శిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. 

కాగా, బాల న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భ‌ర‌త్‌... సుమారు 80కు పైగా సినిమాల్లో నటించాడు. రెడీ, వెంకీ, ఢీ, కింగ్, దూకుడు, మిస్టర్ పర్ఫెక్ట్, పెదబాబు, ఆనందమానందమాయే, గుడుంబా శంకర్, హ్యాపీ, పోకిరి, అందాల రాముడు, దుబాయ్ శీను ఇలా  ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తనదైన కామెడీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను కడుపుబ్బా నవ్వించాడు. 

అయితే, మధ్యలో చదువు కారణంగా కొంత‌కాలం సినిమాల‌కు దూరమయ్యాడు. ఆ త‌ర్వాత‌ అల్లు శిరీష్ నటించిన 'ఏబీసీడీ' సినిమాలో సెకండ్ హీరోగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత 'ఇద్దరి లోకం ఒకటే', 'ఆచారి ఆమెరికా యాత్ర', 'విశ్వం' తదితర సినిమాల్లోనూ కీల‌క పాత్ర‌లు పోషించాడు. 



More Telugu News