బలూచిస్థాన్ లో బాంబు పేలుడు

  • కిల్లా అబ్దుల్లా జిల్లాలోని ఓ మార్కెట్లో బాంబు పేలుడు
  • నలుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు
  • పలు షాపులు ధ్వంసం
పాకిస్థాన్ నుంచి విడిపోయి, స్వతంత్ర దేశంగా అవతరించేందుకు పోరాటం చేస్తున్న బలూచిస్థాన్ లో బాంబు పేలుడు సంభవించింది. బలూచ్ ప్రావిన్స్ లోని కిల్లా అబ్దుల్లా జిల్లాలోని ఓ మార్కెట్లో బాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో పలు షాపులు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కిల్లా జిల్లా డిప్యూటీ కమిషనర్ రియాజ్ ఖాన్ తెలిపారు. 


More Telugu News