శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు

  • పది రోజుల క్రితం ఆలయానికి ఇతర మతస్థుల రాక
  • వారి వద్ద లభ్యమైన అన్యమత పుస్తకాలు
  • ఘటన వెలుగులోకి రావడంతో ఈవో చర్యలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌ఓ) అయ్యన్నపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎస్. శ్రీనివాసరావు సస్పెన్షన్ వేటు వేశారు. సీఎస్‌ఓగా ఉద్యోగ బాధ్యతల పట్ల అయ్యన్న నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఈవో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే, సుమారు పది రోజుల క్రితం, ఇతర మతాలకు చెందిన కొందరు వ్యక్తులు ఆలయ సందర్శన కోసం వచ్చారని తెలిసింది. ఆ సమయంలో వారి వద్ద అన్యమతానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నట్లు క్యూ లైన్ల వద్ద భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో సిబ్బంది వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇతర మతస్థులు శ్రీశైలంలో కలకలం సృష్టించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, భద్రతాపరమైన అంశాల్లో సీఎస్‌ఓ అయ్యన్న నిర్లక్ష్యంగా ఉన్నారని భావించిన ఈవో శ్రీనివాసరావు, ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరిపే అవకాశం ఉంది. 


More Telugu News