Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చిన పూనమ్ కౌర్

Poonam Kaur Gifts Chandrababu Naidu
Advertisement
  • హైదరాబాదులో తెలుగు వన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవం
  • హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు
  • చంద్రబాబుకు కానుక అందించి మురిసిపోయిన పూనమ్ కౌర్
Advertisement
హైదరాబాదులో జరిగిన తెలుగు వన్ డిజిటల్ మీడియా సంస్థ వజ్రోత్సవ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి పూనమ్ కౌర్ సీఎం చంద్రబాబుకు ఓ విశిష్ట  కానుక అందించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అమరావతి స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఓ పటచిత్ర ఆర్ట్ వర్క్ ను ఆయనకు బహూకరించినట్టు ఆమె తెలిపారు. ఈ మేరకు ఫొటోను కూడా పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఆమె పోస్టుకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 
Advertisement
Advertisement
Chandrababu Naidu
Poonam Kaur
Telugu Film Actress
Andhra Pradesh CM
Gift
Amaravati Artwork
Telugu One Digital Media
Jubilee Celebrations
Hyderabad Event
Social Media Post

More Telugu News