గుల్జార్ హౌస్ ప్రమాదం.. పదహారుకు చేరిన మరణాలు.. మృతులు వీళ్లే..!

––
చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పదహారుకు పెరిగిందని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదటి అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయని, బిల్డింగ్ నిండా పొగ అలుముకోవడంతో శ్వాస అందక పలువురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

మరణించిన వారి వివరాలు..
రాజేంద్రకుమార్‌ (67), అభిషేక్‌ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్‌ (17), శీతల్‌ జైన్‌ (37), ఇరాజ్‌ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్‌, అన్య మోదీ, పంకజ్‌ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్‌, ప్రథమ్‌ అగర్వాల్‌, ప్రాంశు అగర్వాల్‌


More Telugu News