తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ప‌లువురు ప్ర‌ముఖులు

   
ఈరోజు తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో పలువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ విరామ ద‌ర్శ‌న స‌మ‌యంలో న‌టుడు ఆది పినిశెట్టి, ఆయ‌న అర్ధాంగి నిక్కీ గ‌ల్రాని, న‌టుడు వైభ‌వ్‌, న‌టి ఐశ్వ‌ర్య రాజేశ్ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. అంత‌కుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆల‌యంలోకి వెళ్లిన వారికి టీటీడీ సిబ్బంది, అధికారులు స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. 

అనంత‌రం ఆల‌యంలో శ్రీవారి సేవ‌లో పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు. ద‌ర్శ‌నం త‌ర్వాత రంగ‌నాయ‌కుల మండ‌పంలో పండితులు వారికి వేదాశీర్వ‌చ‌నం చేసి స్వామివారి తీర్థప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

మ‌రోవైపు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్‌, హెడ్ కోచ్ గౌతం గంభీర్ కుటుంబ సమేతంగా శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. వేకువ‌జామున స్వామివారి సుప్ర‌భాత సేవ‌లో పాల్గొన్నారు. అలాగే మాజీ ప్ర‌ధాన‌మంత్రి హెచ్‌డీ దేవెగౌడ, కేంద్ర‌మ‌త్రి ప్ర‌హ్లాద్ జోషి కూడా వేర్వేరుగా తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.

 


More Telugu News