లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ను చట్టం ముందు నిలబెట్టాలి: డొక్కా మాణిక్య వరప్రసాద్
- లిక్కర్ స్కామ్ లో లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న డొక్కా
- ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపాటు
- ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి
ఏపీ లిక్కర్ స్కామ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతోంది. ఈ అంశంపై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ స్కామ్ వెనకున్న బిగ్ బాస్ ను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని దుయ్యబట్టారు.
అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసే శక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవ్వాలని వేంకటేశ్వరస్వామి వారిని కోరుకున్నానని చెప్పారు. ఈరోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలను తాజాగా అరెస్ట్ చేశారు.