Asaduddin Owaisi: హజ్ యాత్రికులకు అసదుద్దీన్ ఒవైసీ కీలక సూచన

Owaisis Key Advice to Hajj Pilgrims
  • పాక్ బుద్ధి కుక్క తోక వంకరలా ఉందన్న ఒవైసీ
  • వారి బుద్ధి మార్చాలని దేవుడిని కోరుకోవాలని సూచన
  • హజ్ యాత్రికులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పించిందన్న రేవంత్
హజ్ యాత్రకు బయల్దేరిన యాత్రికులకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక సూచన చేశారు. పాకిస్థాన్ బుద్ధి కుక్క తోక వంకరలా ఉందని... వారి బుద్ధిని మార్చాలని హజ్ కు వెళుతున్న వారంతా దేవుడిని కోరుకోవాలని సూచించారు. సమయం వచ్చినప్పుడు పాకిస్థాన్ బుద్ధిని తప్పకుండా మారుస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఈ పవిత్ర యాత్ర వారి జీవితంలో ఆథ్యాత్మిక శాంతిని, సంతోషాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. హజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పించిందని చెప్పారు. 
Asaduddin Owaisi
Hajj pilgrimage
Pakistan
MIM
Revanth Reddy
Telangana
India
Hajj advice
Political Commentary

More Telugu News