పట్టాలు దాటుతుంటే సడెన్ గా కదిలిన గూడ్స్ ట్రైన్.. వీడియో ఇదిగో!
––
తిమ్మాపూర్ పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో బీహార్ కు చెందిన వ్యక్తి పనిచేస్తున్నాడు. నిత్యం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పైనుంచి రాకపోకలు సాగించేవాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం కంపెనీలో విధులు పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు ఇదివరకు కూడా రెండు మూడు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. పాదచారుల కోసం సమీపంలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నప్పటికీ చాలామంది పట్టాలు క్రాస్ చేసి వెళుతుంటారు. ఇది ప్రమాదకరమని, పట్టాలు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.