Apollo Pharmacy Employees: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు అపోలో ఫార్మసీ ఉద్యోగులు మృతి

Three Apollo Pharmacy Employees Killed in Kakinada Road Accident

  • తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
  • ముగ్గురు యువకులు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
  • విశాఫట్నంలో ఓ సమావేశానికి హజరై తిరుగు ప్రయాణంలో ఉండగా ప్రమాదం

కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అపోలో ఫార్మసీ ఉద్యోగులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది.

వివరాల్లోకి వెళితే, రాజమహేంద్రవరం అపోలో ఫార్మసీలో ఉద్యోగులుగా పనిచేస్తున్న కొందరు యువకులు విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన సమావేశానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఉన్నారు. తుని వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఐరన్ లోడ్ లారీని వారు ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన గెడ్డం రామరాజు, హజరత్ వాలీ, మరియు తణుకుకు చెందిన వరాడ సుధీర్ అక్కడికక్కడే మృతి చెందగా, గోనా శివశంకర్, వెంకట సుబ్బారావులకు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Apollo Pharmacy Employees
Road Accident
Kakinada
Tuni
National Highway
Andhra Pradesh
Fatal Crash
Geddham Rama Raju
Hazrat Vali
Varada Sudheer
  • Loading...

More Telugu News