13-year-old boy: ట్యూషన్ టీచర్ ను గర్భవతిని చేసిన 13 ఏళ్ల బాలుడు!

13 Year Old Boy Impregnates 23 Year Old Teacher in Gujarat
  • సూరత్‌లో 13 ఏళ్ల విద్యార్థితో 23 ఏళ్ల టీచర్‌కు లైంగిక సంబంధం
  • టీచర్ గర్భం దాల్చడంతో బాలుడితో కలిసి పరార్
  • రాజస్థాన్ సరిహద్దులో విద్యార్థి, టీచర్‌ను పట్టుకున్న పోలీసులు
  • రెండేళ్లుగా ప్రేమ, ఏడాదిగా శారీరక సంబంధం ఉన్నట్లు టీచర్ వాంగ్మూలం
గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలుడి వల్ల తాను గర్భం దాల్చానని 23 ఏళ్ల మహిళా టీచర్ వెల్లడించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రత్యేక పోక్సో కోర్టులో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం 22 వారాల గర్భవతిగా ఉన్న సదరు టీచర్‌కు గర్భస్రావం చేయాలని, పుట్టబోయే బిడ్డ డీఎన్‌ఏ పరీక్ష కోసం పిండాన్ని భద్రపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఆసుపత్రిలో ఈ ప్రక్రియ చేపట్టాలని న్యాయస్థానం సూచించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సూరత్‌లోని పూనా ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలుడ్నిఏప్రిల్ 25న అతని 23 ఏళ్ల ట్యూషన్ టీచర్ కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయిందని ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వారిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, ఏప్రిల్ 30న రాజస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఓ ప్రైవేటు బస్సులో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. జైపూర్ నుంచి అహ్మదాబాద్ వస్తుండగా వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వీరిద్దరూ ఐదు వేర్వేరు నగరాలు చుట్టివచ్చినట్లు విచారణలో తేలింది.

పట్టుబడిన టీచర్, స్టూడెంట్ ను పోలీసులు పూనా పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు బాలుడు ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచి తాను అతనికి ట్యూషన్ చెప్పేందుకు వాళ్ల ఇంటికి వెళ్లేదాన్నని టీచర్ తన వాంగ్మూలంలో పేర్కొంది. ఆ తర్వాత, తన ఇంటి వద్దనే విద్యార్థులకు ట్యూషన్ చెప్పడం ప్రారంభించానని, ఈ క్రమంలోనే ఆ బాలుడితో పరిచయం పెరిగిందని తెలిపింది.

గత రెండేళ్లుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, సుమారు ఏడాది కాలంగా శారీరక సంబంధం కూడా ఉందని టీచర్ అంగీకరించింది. ఈ 13 ఏళ్ల విద్యార్థి వల్లే తాను గర్భం దాల్చానని ఆమె చెప్పింది. ఈ విషయాన్ని మైనర్ బాలుడు కూడా పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. తాను గర్భవతినని ఇటీవల తెలియడంతో, ఏం చేయాలో పాలుపోక విద్యార్థితో కలిసి పారిపోయినట్లు టీచర్ విచారణలో వెల్లడించింది. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
13-year-old boy
23-year-old teacher
pregnancy
Surat
Gujarat
India
POSCO Act
minor
abortion
DNA test

More Telugu News