అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి.. కానీ అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు: మంత్రి లోకేశ్

  • అంద‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌నులు చేసుకోవాల‌ని సూచ‌న‌
  • గ్రామ‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు యూనిటీగా ఉండాల‌న్న మంత్రి
  • అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దని హితవు
  • మూడవ వ్యక్తి చెప్పింది నమ్మవద్దన్న మంత్రి లోకేశ్
టీడీపీ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు మంత్రి నారా లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు చేశారు. అంద‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌నులు చేసుకోవాల‌ని సూచించారు. గ్రామ‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు యూనిటీగా ఉండాల‌ని తెలిపారు. అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి. కానీ అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు. దయచేసి మూడవ వ్యక్తి చెప్పింది నమ్మవద్దని లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేర‌కు వివిధ స్థాయిల‌లో ప‌నులు ఎలా చేసుకోవాలో తెలుపుతూ ఆయ‌న ఒక నోట్ విడుద‌ల చేశారు. 

1) దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి 
2) గ్రామస్థాయిలో పని జరగపోతే మండల పార్టీ నాయకుల ద్వారా పనులు చేసుకోండి 
3) అప్పటికి అవ్వకపోతే ఎమ్మెల్యే (MLA) దగ్గరకి వెళ్లండి 
4) అప్పటికి అవ్వకపోతే మీ ఇంచార్జీ మినిస్టర్ దగ్గరికి వెళ్లండి
5) అప్పటికి అవ్వకపోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి ఒక అర్జీ ఇవ్వండి.

"మన ఇంట్లో ఉంటే పనులు అవ్వవు. దయచేసి మీ సొంత పనులు అడగండి. మీకు సమస్యలు లేకపోతే అప్పుడూ  మిగతావారి పనులు తీసుకురండి. ఎక్కడ నిరుత్సాహ పడవద్దు. అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి. కానీ అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు. దయచేసి మూడవ వ్యక్తి చెప్పింది నమ్మవద్దు. మీరు లైవ్ లో విన్నవి నమ్మండి. మన ఎమ్మెల్యే వైసీపీ వాళ్ల‌కి చేస్తున్నాడు అంటా? లోకేశ్‌ టైమ్ ఇవ్వడం లేదు అంటా? బాబు గారు అసలు కలవడం లేదు అంటా? ఇలాంటి పుకార్లు నమ్మవద్దు. మేము మనషులమే కదా! కొన్ని తప్పులు చేయవచ్చు. దయచేసి మీరు చెప్పండి" అని మంత్రి లోకేశ్ కార్యక‌ర్త‌ల‌ను కోరారు. 


More Telugu News