బెజవాడ కనకదుర్గమ్మకు అరుదైన పట్టుచీర బహుకరణ

  • విజయవాడ దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను బహుకరించిన సిరిసిల్ల చేనేత కార్మికుడు
  • పట్టుచీరను అమ్మవారి విగ్రహం ఎదురుగా ఉంచి పూజలు చేసి ఈవోకు అందజేత
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు ఓ భక్తుడు అరుదైన కానుకను బహుకరించారు. తెలంగాణ రాష్ట్రం, సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయకుమార్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను బుధవారం అమ్మవారికి సమర్పించారు.

ముందుగా పట్టుచీరను అమ్మవారి విగ్రహం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ పట్టుచీరను ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీనానాయక్‌కు అందజేశారు. 

.


More Telugu News