టాలీవుడ్ యువ న‌టి సాహ‌సం.. ఏకంగా విమానం నుంచి జంప్‌.. వైర‌ల్ వీడియో

  • దుబాయ్‌లో స్కై డైవింగ్ చేసిన భాగ్య‌శ్రీ బోర్సే
  • విమానంలో చాలా ఎత్తుకు వెళ్లాక అక్క‌డి నుంచి జంప్ చేసిన న‌టి
  • ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన యంగ్ బ్యూటీ
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించిన 'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యువ న‌టి భాగ్య‌శ్రీ బోర్సే దుబాయ్‌లో స్కై డైవింగ్ చేశారు. "వ‌న్ లైఫ్ వ‌న్ బ్రీత్ వ‌న్ జంప్" అనే క్యాప్ష‌న్‌తో త‌న సాహ‌సం తాలూకు వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో పంచుకున్నారు. 

ఇక‌, స్కై డైవింగ్‌లో భాగంగా విమానంలో చాలా ఎత్తుకు వెళ్లాక అక్క‌డి నుంచి ఆమె స‌హాయ‌కుడి సాయంతో పారాచూట్ వేసుకుని ధైర్యంగా కిందికి దూకేశారు. ఈ సాహ‌స‌పూరిత జంప్ కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 

కాగా, భాగ్య‌శ్రీ బోర్సే ప్ర‌స్తుతం తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ 'కింగ్‌డ‌మ్' మూవీతో పాటు రామ్ పోతినేని స‌ర‌స‌న ఓ మూవీలో, దుల్క‌ర్ స‌ల్మాన్ 'కాంత' చిత్రంలో న‌టిస్తున్నారు.


More Telugu News