ఏపీ భ‌వ‌న్‌లో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు ప్ర‌క్రియ‌ నిలిపివేత‌

  • ఏపీ భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో 0.37 ఎక‌రాల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించిన అధికారులు
  • అందులో రెండు ప్రార్థ‌నా మందిరాలు ఉన్నట్లు వెల్ల‌డి
  • వాటిని తొల‌గించాల్సి ఉంద‌ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు
  • ప్రార్థనా మందిరాల తొల‌గింపుపై సంయ‌మ‌నం పాటించాల‌ని చంద్ర‌బాబు సూచన‌
దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు అంశంపై అధికారుల‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడారు. 0.37 ఎక‌రాల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించిన అధికారులు... అందులో రెండు ప్రార్థ‌నా మందిరాలు ఉన్నాయ‌ని తెలిపారు. వాటిని తొల‌గించాల్సి ఉంద‌ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

అయితే, ప్రార్థనా మందిరాల తొల‌గింపుపై సంయ‌మ‌నం పాటించాల‌ని అధికారుల‌కు చంద్ర‌బాబు సూచించారు. ఇది ప్ర‌జ‌ల మనోభావాలు దెబ్బ‌తినే అంశం క‌నుక ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. ఈ విష‌యంలో ఎలాంటి తొంద‌ర‌పాటు చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని అధికారుల‌తో చెప్పారు. ముఖ్య‌మంత్రి సూచ‌న మేర‌కు ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు ప్ర‌క్రియ‌ను అధికారులు నిలిపివేశారు. 


More Telugu News