కశ్మీర్ ఉగ్రవాదంపై వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు
- పాక్‌ను నిందిస్తే సరిపోదు.. సమస్య మూలాల్లోకి వెళ్లాలని సూచన
- ఉగ్రవాద నర్సరీగా పాక్.. కానీ అసలు సమస్య అక్కడే
- కశ్మీర్‌లో ఉగ్రవాదం ఎందుకు ఆగదో చెప్పిన బాలీవుడ్ డైరెక్టర్
కశ్మీర్‌లో ఉగ్రవాదం ఏళ్ల తరబడి కొనసాగడానికి గల కారణాలపై ప్రముఖ సినీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన అభిప్రాయాలను వెల్లడించారు. కేవలం పాకిస్థాన్‌ను నిందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఒక నర్సరీగా పనిచేస్తోందన్న వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. అయితే, ఉగ్రవాదులకు కొంతమంది మన పౌరులే సహకరిస్తున్నారని, దీంతో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారని ఆరోపించారు. ఉగ్రవాదం కొనసాగడానికి ఇదే మూలకారణమని ఆయన నొక్కి చెప్పారు.
ఉగ్రవాదులను సరిహద్దులు దాటించడంతో పాటు వారికి ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఆశ్రయం కల్పిస్తున్నారని వివేక్ అగ్నిహోత్రి ఆరోపించారు. దాడుల అనంతరం ఉగ్రవాదులను జనంలో కలిసిపోయేలా చేసి, కొంతకాలం ఆశ్రయమిచ్చి ఆపై వారిని తప్పిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ఉగ్రవాద సానుభూతిపరులను గుర్తించి కంట్రోల్ చేయాలని చెప్పారు. అప్పటివరకు కశ్మీర్ లో ఉగ్రవాదం అంతం కాదని వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
1980లలో పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని అణచివేసిన తీరును వివేక్ అగ్నిహోత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అప్పటి పంజాబ్ పోలీస్ చీఫ్ కేపీఎస్ గిల్ క్షేత్రస్థాయిలో గట్టి చర్యలు తీసుకుని, హింసకు పాల్పడిన వారిని గుర్తించి ఏరివేయడం వల్లే అక్కడ ఉగ్రవాదం అంతమైందని ఆయన పేర్కొన్నారు. "పంజాబ్‌లో కేపీఎస్ గిల్ నేరుగా ఇంటికి వెళ్లి హంతకులను పట్టుకున్నప్పుడే అక్కడ ఉగ్రవాదం సమూలంగా నిర్మూలించబడింది. అలాంటి చర్యలు చేపట్టనంత వరకు ఇక్కడ సమస్య పరిష్కారం కాదు" అని వివేక్ అగ్నిహోత్రి స్పష్టం చేశారు. సమస్యను మూలాల నుంచి పరిష్కరించాలంటే అంతర్గత సహకారాన్ని అడ్డుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.