ప‌వ‌న్ 'ఓజీ'పై కీల‌క అప్‌డేట్‌

  • పవన్ కల్యాణ్‌, సుజీత్ కాంబినేష‌న్‌లో `ఓజీ`
  • ఈ చిత్రం షూటింగ్ ఇవాళ పున‌ఃప్రారంభ‌మైన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌ట‌న‌
  • "మ‌ళ్లీ మొద‌లైంది... ఈసారి ముగిద్దాం" అనే క్యాప్ష‌న్ తో షూటింగ్ స్పాట్ ఫొటో షేర్    
పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌, యువ ద‌ర్శ‌కుడు సుజీత్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం 'ఓజీ'. చాలా కాలంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే, ఈ చిత్రం షూటింగ్ ఇవాళ పున‌ఃప్రారంభ‌మైన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను నిర్మాణ సంస్థ డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. "మ‌ళ్లీ మొద‌లైంది... ఈసారి ముగిద్దాం" అనే క్యాప్ష‌న్ తో షూటింగ్ స్పాట్ ఫొటోను షేర్ చేశారు.  

అయితే, షూట్‌లో ప‌వ‌ర్ స్టార్ పాల్గొన్నారా లేదా అనేది క్లారిటీ లేదు. ఎప్పుడు పాల్గొంటారు అనేది ఆసక్తికరంగా మారింది. కానీ 'ఓజీ' సినిమా రీస్టార్ట్ అయ్యిందనే వార్త పవన్‌ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఎందుకంటే అభిమానులంతా ఈ మూవీ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇందులో పవన్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ పూనకాలు తెప్పించింది. ఇక‌, ఇటీవ‌లే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ పూర్తి చేసిన ప‌వ‌న్‌.. ఇప్పుడు 'ఓజీ' మూవీని పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు. ఈ క్రమంలో నేటి నుంచి చిత్రీకరణ కొనసాగిస్తున్నారు.

ఇందులో పవన్ కల్యాణ్‌తో పాటు ఇమ్రాన్‌ హష్మి, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప‌వ‌ర్‌స్టార్ స‌ర‌స‌న‌ ప్రియాంక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్ర‌ముఖ నిర్మాత‌ డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.


More Telugu News