విక్ట‌రీ ర్యాలీలో పాల్గొన్న షాహిద్ ఆఫ్రిది... వీడియో వైర‌ల్‌!

    
భార‌త్‌పై యుద్ధం గెలిచామ‌ని పాకిస్థాన్ ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్ గొప్ప‌లు చెప్పుకున్న విష‌యం తెలిసిందే. అస‌లు తాము సీజ్ ఫైర్ కోసం అభ్య‌ర్థించ‌లేద‌ని కూడా ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇలా లేనిపోని గొప్ప‌లు చెప్పుకుంటూ బ‌తికేస్తోంది దాయాది దేశం. 

అయితే, తాజాగా ఆ దేశ మాజీ క్రికెట‌ర్ షాహిద్ ఆఫ్రిది మ‌రో అడుగు ముందుకేసి క‌రాచీలో సోమ‌వారం జ‌రిగిన విక్ట‌రీ ర్యాలీలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఇక‌, ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి స‌మ‌యంలోనూ భార‌త ప్ర‌భుత్వంపై, మ‌న సైన్యంపై అత‌డు అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. గ‌తంలో పాకిస్థాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పీఓకే)లో పాక్‌కు అనుకూలంగా ఆఫ్రిది ర్యాలీ చేసి, వార్త‌ల్లో నిలిచాడు.    




More Telugu News