సినిమాగా ‘ఆపరేషన్ సిందూర్’.. ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్
- నుదుట సింధూరంతో సైనికురాలు.. ఆసక్తి రేపుతున్న పోస్టర్
- భారత సైన్యం సాహస గాథను తెరకెక్కించనున్న డైరెక్టర్ ఉత్తమ్ మహేశ్వరి
- నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్, ది కంటెంట్ ఇంజనీర్ సంయుక్త నిర్మాణం
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఒక మహిళా సైనికురాలు వెనుకకు తిరిగి నిలబడి, సైనిక దుస్తుల్లో రైఫిల్ పట్టుకుని, తన పాపిటలో సింధూరం దిద్దుకుంటున్న దృశ్యం ఆకట్టుకుంటోంది. యుద్ధ ట్యాంకులు, ముళ్ల కంచెలు, గగనతలంలో దూసుకెళ్తున్న యుద్ధ విమానాలు వంటి అంశాలు పోస్టర్ నేపథ్యంగా ఉండి, ధైర్యం, త్యాగం, దేశభక్తి వంటి భావనలను ప్రతిబింబిస్తున్నాయి. "ఆపరేషన్ సిందూర్" అనే టైటిల్‌ను ప్రముఖంగా ప్రదర్శించగా, "సిందూర్"లోని రెండవ 'O' అక్షరం స్థానంలో కుంకుమ అద్దినట్లు చూపించారు. త్రివర్ణ పతాక రంగులలో "భారత్ మాతా కీ జై" అనే నినాదం దేశభక్తి స్ఫూర్తిని మరింత ఇనుమడింపజేస్తోంది. ఉద్విగ్నభరితమైన, భావోద్వేగమైన కథనంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.