పాకిస్థాన్ కు ఆర్థిక ప్యాకేజీపై ఐఎంఎఫ్ ఓటింగ్... దూరంగా ఉన్న భారత్

  • అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) బోర్డు అందించే బెయిలౌట్ ప్యాకేజీని పాకిస్థాన్ కు అందించవద్దన్న భారత్
  • ఐఎంఎఫ్ సహాయానికి సంబంధించి షరతులను పాటించడంలో పాకిస్థాన్ విఫలమైందని వెల్లడి
  • ఆర్ధిక సహాయాన్ని పాకిస్థాన్ పరోక్షంగా సైనిక నిఘా కార్యకలాపాలకు వినియోగిస్తుందన్న భారత్
పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) బోర్డు అందించే బెయిలౌట్ ప్యాకేజీని భారతదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. గతంలో పాకిస్థాన్‌కు ఇచ్చిన రుణాలను దుర్వినియోగం చేసిందంటూ భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పాకిస్థాన్‌కు ప్రతిపాదించిన 1.3 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీపై భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉంది.

ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్‌లో దాడి చేసి 26 మందిని హతమార్చడం, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవడం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

నిన్న వాషింగ్టన్‌లో ఐఎంఎఫ్ బోర్డు సమావేశం జరిగింది. ఐఎంఎఫ్ సహాయానికి సంబంధించి షరతులను పాటించడంలో పాకిస్థాన్ విఫలమైందని భారత్ స్పష్టం చేసింది. ఆర్థిక సహాయాన్ని పాకిస్థాన్ పరోక్షంగా సైనిక నిఘా కార్యకలాపాలకు వినియోగిస్తుందని తెలిపింది.

భారత గడ్డపై దాడులకు, కుట్ర పన్నడానికి లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తుందని భారత్ వెల్లడించింది. సరిహద్దు ఉగ్రవాదం అంతం చేయడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోని పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం అందించడంలో జాగ్రత్త వహించాలని ఐఎంఎఫ్ బోర్డును భారత్ కోరింది. 


More Telugu News

Pakistan IMF Financial Package India Bailout Terrorism Cross-border Terrorism Lashkar-e-Taiba Jaish-e-Mohammad US