China: నమ్ముకున్న పాకిస్థాన్ ను ముంచేసిన చైనా... పేలకుండా తుస్సుమన్న చైనా మిస్సైల్

Chinese Weapons Fail During Indo Pak Confrontation
షార్ట్స్‌లో చూడండి
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్ సైన్యం చైనా నుంచి సేకరించిన ఆయుధ వ్యవస్థలు దారుణంగా విఫలమైనట్లు తెలుస్తోంది. భారత దాడులను ఎదుర్కోవడంలో ఈ ఆయుధాలు నిష్ఫలమవ్వడమే కాకుండా, కొన్ని పేలకుండానే కిందపడిపోయిన ఘటనలు వెలుగుచూశాయి. ఈ పరిణామాలతో చైనా ఆయుధాల నాణ్యతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో పాకిస్థాన్ ప్రయోగించిన చైనీస్ PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి పేలకుండా పడి ఉండటాన్ని భారత బలగాలు గుర్తించాయి. మరోవైపు, లాహోర్‌లోని పాకిస్థాన్ వైమానిక స్థావరంలో ఏర్పాటు చేసిన చైనా నిర్మిత HQ-9B ఎయిర్ డిఫెన్స్ (AD) వ్యవస్థను భారత దళాలు ధ్వంసం చేశాయి. భారత డ్రోన్ దూసుకొస్తున్నా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమీ చేయలేకపోయింది.

చైనా నుంచి పాకిస్థాన్ అధిక ధరకు కొనుగోలు చేసిన ఈ ఆయుధాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారడంతో పాటు, వాటిని వినియోగించే నైపుణ్యం, శిక్షణ పాకిస్థాన్ దళాలకు కొరవడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల, పాకిస్థాన్ సరిహద్దుల వద్ద మోహరించిన చైనా HQ-9 వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా భారత్‌పై క్షిపణి, డ్రోన్ దాడులకు యత్నించగా, భారత S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా అడ్డుకొని నాశనం చేసింది. 

అంతేకాదు, జేఎఫ్-17 ఫైటర్ జెట్లను చైనా ఎంతో సమర్థవంతమైనవని చైనా చెప్పుకుంటుండగా... భారత్ పై ఆ యుద్ధ విమానాలను ఉపయోగించి పాక్ భంగపాటుకు గురైంది. నిన్న రాత్రి రెండు జేఎఫ్-17 ఫైటర్లను భారత్ కూల్చివేసింది. అవి గాల్లోకి లేచీ లేవడంతోనే భారత గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని గుర్తించి ఇంటర్ సెప్టర్ లను పంపించి పేల్చివేశాయి. 

ఈ ఘటనలు చైనా సైనిక పరికరాల విశ్వసనీయతపై చర్చకు దారితీయగా, పాక్ సైనికుల ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఈ వైఫల్యాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు చైనాను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
Go Back to Shorts
China
Pakistan
India
PL-15 Missile
HQ-9B Air Defence System
Military Equipment Failure
Operation Sindhu
Indo-Pak Conflict
Chinese Military Technology
S-400 Air Defence System

More Telugu News