తిరుమల ఆలయంపై మళ్లీ చక్కర్లు కొట్టిన విమానం... భక్తుల ఆగ్రహం
- ఆలయంపై నుంచి వెళ్లిన మూడు విమానాలు
- ఆగమ శాస్త్ర నిబంధనలకు ఇది విరుద్ధం
- తిరుమలను "నో ఫ్లై జోన్"గా ప్రకటించాలని కోరుతున్న భక్తులు
నిన్న ఉదయం కూడా ఓ విమానం స్వామివారి ఆలయం మీదుగా వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలపై టీటీడీ భద్రతా విభాగం అధికారులు ఆరా తీస్తున్నారు. తరచూ జరుగుతున్న ఈ ఉల్లంఘనల దృష్ట్యా, తిరుమల క్షేత్రాన్ని పూర్తిస్థాయి "నో ఫ్లై జోన్"గా ప్రకటించి, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.