Pakistan: పాక్ ఫేక్ ప్రచారం.. రాజౌరీలో సూసైడ్ దాడి అబద్ధం

––
జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీలో సూసైడ్ అటాక్ చేశామంటూ పాకిస్థాన్ ఫేక్ ప్రచారం చేస్తోంది. రాజౌరీలోని ఆర్మీ బ్రిగేడ్ పై సూసైడ్ అటాక్ చేశామని, పంజాబ్ లోని జలంధర్ లో డ్రోన్ తో దాడి చేశామని పాక్ చేస్తున్న ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కొట్టిపారేసింది. జమ్మూకాశ్మీర్ లోని ఆర్మీ క్యాంపులపై ఎలాంటి సూసైడ్ అటాక్ జరగలేదని స్పష్టం చేసింది. జలంధర్ లో డ్రోన్ దాడికి సంబంధించి పాక్ విడుదల చేసిన వీడియో పొలాల్లోని పంట వ్యర్థాలను రైతులు కాల్చిన ఘటనకు సంబంధించినదని వివరణ ఇచ్చింది. పాక్ తప్పుడు ప్రచారం నమ్మొద్దని ప్రజలకు సూచించింది.